వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బాణం రాజ్ తరుణ్. ఆ మధ్య ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినా మళ్లీ తట్టుకుని కిట్టుతో హిట్టు కొట్టాడు ఈ కుర్రాడు. మళ్లీ ఇప్పుడు అంధగాడు అంటూ వచ్చాడు. మరి ఇది ఎలా ఉంది..? మరోసారి రాజ్ మాయ చేసాడా..?
కథ : గౌతమ్(రాజ్ తరుణ్) కు కళ్ళు కనిపించవు. చిన్నప్పట్నుంచీ అంధుడే. జీవితంలో కళ్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదనుకునే మనస్తత్వం గౌతమ్ ది. అలాంటి గౌతమ్ కు నేత్ర(హెబ్బాపటేల్) తో పరిచయం అవుతుంది. కళ్లు లేకపోయినా ఉన్నట్లు యాక్ట్ చేసి ఆమెను లవ్ లో పడేస్తాడు. కానీ తర్వాత నిజం తెలిసి వదిలేసి వెళ్లిపోతుంది. ఆ వెంటనే గౌతమ్ కు కళ్లు వస్తాయి. కానీ వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. దాంతో తన కళ్లు తీసేయాలంటూ డాక్టర్ ఆశిష్(ఆశిష్ విధ్యార్థి) దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ జీవితంలోకి ఉన్నట్లుండి కులకర్ణి(రాజేంద్రప్రసాద్) ప్రవేశిస్తాడు. ఏకంగా మర్డర్లే చేయిస్తాడు. అసలు కులకర్ణికి, గౌతమ్ కు సంబంధం ఏంటి..? ఎందుకు మర్డర్లు చేస్తాడు..? ఇవన్నీ మిగిలిన కథ..
కథనం : వెలిగొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు రచయితగా ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు. ఈయన రాసిన సినిమాలన్నీ దాదాపు పరాజయాలే. కానీ దర్శకుడిగా మారిన తొలి సినిమాతోనే మంచి ప్రయత్నం చేసాడు. కాస్త ఇంప్రెషన్ కొట్టేసాడు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో హీరోను బ్లైండ్ గా చూపించే కథ రాసుకున్నపుడే సగం సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఇక అక్కడ్నుంచి అతడి పని ఈజీ అయిపోయింది. కళ్లు రాకముందు హీరో చేసే పనులన్నీ మనకు సరదాగా అనిపిస్తాయి. అవి మనకు రోజూ చూసేవి అయినా.. హీరో యాంగిల్ లో నవ్వు తెప్పిస్తాయి. ఇక ఆయనకు కళ్లు వచ్చిన తర్వాత కథ సీరియస్ టర్న్ తీసుకోవడం.. అప్పట్నుంచి మరో కథలోకి పూర్తిగా వెళ్ళిపోవడం.. మధ్యలో హీరో లవ్ ట్రాక్.. వీటితోనే ఫస్టాఫ్ అయిపోతుంది. సూపర్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ వేసాడు దర్శకుడు.
Comments
Post a Comment