
ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంత ప్రాణ స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు. ఈ ఇద్దరూ ఎక్కడికి వచ్చినా కలిసే వస్తారు. ఏ ఫంక్షన్ లో కనిపించినా ఇద్దరూ కలిసే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు దేహాలు.. ఒక ప్రాణం తరహాలో మారిపోయారు ఇప్పుడు పవన్, త్రివిక్రమ్. గతంలో ఎంత ప్రాణ స్నేహితుడు అయినా పవన్ ను చేరాలంటే కొన్ని అడ్డు గోడలు ఉండేవి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఆ కోటరి కూడా దాటేసాడని.. బయటి వాళ్లెవరైనా పవన్ ని కలవాలంటే ముందు త్రివిక్రమ్ ను దాటాలని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ప్లేస్ శరత్ మరార్ కు ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని త్రివిక్రమ్ తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రతీ విషయంలోనూ త్రివిక్రమ్ సలహా లేకుండా పవన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని తెలుస్తోంది.
పైగా ఆయన రాజకీయ జీవితానికి కూడా త్రివిక్రమ్ ను చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే. ఈ సినిమా పవన్ రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడేలా మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ కాసేపు విద్యార్థి సంఘ నాయకుడిగా కనిపిస్తాడని.. విద్యా వ్యవస్థలో జరిగే లోపాలపై పవన్ మాట్లాడతాడని ఈ సీన్స్ పై త్రివిక్రమ్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇవన్నీ పవన్ రాజకీయాలకు నాందీ పలకడానికి పనికొస్తాయని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఏమో.. ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే పవర్ స్టార్.. మళ్లీ తన ఆప్తమిత్రుడు శరత్ మరార్ కు ముందు స్థానం ఇచ్చి.. త్రివిక్రమ్ ను మళ్లీ స్నేహితుడిగానే పెట్టుకుంటాడేమో ఎవరికి తెలుసు. ప్రస్తుతానికైతే పవన్ కోటరిలో త్రివిక్రమ్ ముందు వరసలో ఉన్నాడు. శివున్ని దర్శించుకోవాలంటే ముందు నందిని పలకిరించినట్లు.. పవన్ ను కలవాలంటే ముందు త్రివిక్రమున్ని దాటాలట మరి..!
Comments
Post a Comment