పాత్ర నచ్చితే మన హీరోయిన్లు చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అని చూడట్లేదు. అందరు హీరోలతోనూ నటిస్తున్నారు. తాజాగా సమంత కూడా ఇదే చేస్తుంది. ఈమె పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతుంది. అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ ను కలిపింది ఎవరు అనుకుంటున్నారా..? ఎవడే సుబ్రమణ్యం సినిమా చేసిన కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ గుర్తున్నాడా..? ఈయన ప్రస్తుతం సావిత్రి బయోపిక్ గా మహానటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తిసురేష్ టైటిల్ రోల్ చేస్తుంది. సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో మళయాల స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.
ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. ఈమెకు జోడీగా నాగ్ అశ్విన్.. విజయ్ ను ఎంచుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యంలో రిషి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మరోసారి తన సినిమాలో అవకాశం ఇస్తున్నాడు. చూడాలిక.. ఈ కొత్త కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో..?
Comments
Post a Comment