అసలే ఈ మధ్య బాలీవుడ్ హీరోల టైమ్ బాగోలేదు. ఆ మధ్య సంజయ్ దత్ కూడా జైలుకి వెళ్లొచ్చాడు. ఇక సల్మాన్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇక వివాదాలకు దూరంగా ఉండే షారుక్ ఇప్పుడు ఓ కేస్ లో ఇరుక్కున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లు.. ఈ ఏడాది ప్రారంభంలో రాయిస్ ప్రమోషన్ లో ఉన్నపుడు షారుఖ్ వడోదరకు క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వెళ్లాడు. బాద్ షాను చూడడానికి అభిమానులు వేల సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అభిమానుల్ని చూసిన ఆనందంలో ట్రైన్ లోంచి ఫ్యాన్స్ కోసం టీ షర్టులు, బాల్స్ విసిరారు. వాటిని పట్టుకోడానికి నానా హంగామా జరిగింది.
అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.. ఓ వ్యక్తి మరణించాడు. ఇదంతా షారుక్ చేసిన పిచ్చి పని వల్లే అంటూ వడోదర రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఒక వ్యక్తి మరణానికి.. తొక్కిసలాటకు కారణమైన షారుక్ ని అరెస్ట్ చేయాలని కోర్టును కోరారు. ఈ కేస్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని టెన్షన్ పడుతున్నాడు కింగ్ ఖాన్.

Comments
Post a Comment