ఇంతకుముందు నాగచైతన్యతో సమంత నటిస్తున్నాడంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా పడాలి. దానికి కారణం ఇప్పుడు ఇద్దరూ ప్రేమలో ఉండటం.. ఇంకొన్నాళ్లైతే పెళ్లిలో పడటం. అవును.. అక్టోబర్ లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా నటిస్తే ఆ సినిమాకు వచ్చే హైపే వేరు. ఇప్పుడు ఆ హైప్ కోసమే చూస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. నాగచైతన్య, సమంత కోసం మంచి కథ సిద్ధం చేస్తున్నారు. చైతూ కూడా సమంతతో నటించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మంచి కథ దొరికితే కాబోయే భార్యతో నటించడానికి అభ్యంతరం లేదన్నాడు చైతూ.
ఇక ఇప్పుడు ఈ సమయం వచ్చేలా కనిపిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఓ తమిళ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సమంత తమిళ్ లో నటించినా.. చైతూకు మాత్రం ఇదే తొలి తమిళ్ సినిమా. అక్కడ భార్య ఇమేజ్ ను వాడుకోనున్నాడు చైతూ. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తన కెరీర్ కోసం భార్య సాయం తీసుకోబోతున్నాడు అక్కినేని వారసుడు.
Comments
Post a Comment