అదేంటి.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు హీరోయిన్ దొరక్కపోవడం ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. జై లవకుశ కోసం ఇప్పుడు ఇలాంటి కష్టాలే దర్శక నిర్మాతలకు వచ్చాయి మరి. ఈ చిత్రంలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్లుగా రాశీఖన్నా.. నివేదా థామస్ నటిస్తుంటే.. చిన్న పాత్ర కోసం నందితను తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేసాడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ పాట కోసం ఓ హీరోయిన్ కావాలి. పక్కా మాస్ డాన్స్ తో పాటు అందాలు కూడా విరివిగా ఆరబోసే ముద్దుగుమ్మ కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ నుంచి ఈ భామను దిగుమతి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో జై లవకుశ షూటింగ్ వేంగా జరుగుతుంది.
ఓ వైపు సినిమాతో పాటు.. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షోకూ డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. షెడ్యూల్ ప్రకారం ప్రతీ శుక్రవారం ముంబైకి వెళ్లి అక్కడ షూటింగ్ చేసి రానున్నాడు జూనియర్. ఈ షో కోసం ఏకంగా 8 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ముంబైలో ఈ షో షూటింగ్ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి.
Comments
Post a Comment